AI చేతికి ఎయిర్ఏషియా!
ఎయిర్ ఇండియాలో ఎయిర్ ఏషియా ఇండియాను విలీనం చేయడానికి టాటా గ్రూపు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందుకు సంబంధించి కాంపిటేషన్ కమిషన్ అనుమతి కోసం వేచి చూస్తున్నది. ఎయిర్ ఏషియా ఇండియాలో టాటా సన్స్‌కు అత్యధికంగా 83.67 శాతం వాటా ఉన్నది. మిగతా వాటా మలేషియా ఎయిర్ఏషియా గ్రూపునకు చెందిన ఎయిర్ఏషియా ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్‌కు ఉన్నది. ఈ వాటాను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి గాను రూ. 139 కోట్లు చెల్లించనుంది. రెండు నెలల క్రితం ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసిన టాటా గ్రూపు.. ఇటీవల దాని అనుబంధ సంస్థయైన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా చేజిక్కించుక్నుది. మరోవైపు, టాటా గ్రూపు.. సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి విస్తారా విమాన సేవలు కూడా అందిస్తున్నది.