టాటాల చేతికి ఎయిర్ ఏషియా ఇండియా
ఎయిరేషియా ఇండియాలో పూర్తి వాటా ఇపుడు టాటా సన్స్ చేతికి వచ్చేసింది. ఈ కంపెనీలో టాటా సన్స్‌కు 83.67 శాతం వాటా ఉండగా, మిగిలిన 16.33 శాతం వాటా మలేషియాకు చెందిన ఎయిరేషియా గ్రూప్‌కు ఉండేది. ఈ వాటాను కూడా ఎయిరిండియా కొనుగోలు చేసింది. దీంతో ఎయిరేషియా భారత కార్యకలాపాలను పూర్తిగా ఎయిరిండియా చేతికి వచ్చేశాయి. ఈ డీల్‌కు గతంలోనే కాంపీటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆమోదం తెలిపింది. మరోవైపు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన సంయుక్త సంస్థ విస్తారాను సైతం టాటా గ్రూప్ నడుపుతోంది. ఇపుడు టాటా గ్రూప్ చేతిలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారా ఉన్నాయన్నమాట.