టెక్ కంపెనీలపై ఆశతో…
ఈవారం అమెరికాలోని ప్రధాన టెక్ కంపెనీలు ఆర్థిక ఫలితాలు ప్రకటించనున్నాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటాతో పాటు ఏటీ అండ్ టీ వంటి కంపెనీలు ఫలితాలు రానున్నాయి. చాలా మంది అనలిస్టులు ఆర్టిఫిషియ్ ఇంటెలిజెన్స్ గురించి ఈ కంపెనీలు ఏమంటాయోనని ఆసక్తితో ఉన్నారు. ఏఐ ప్రభావం ఈ కంపెనీలపై ఏమాత్రం ఉందో అంచనాకు రావడానికి ఈ ఫలితాలు ఉపకిస్తాయని భావిస్తున్నాయి. మరోవైపు జూకర్ బర్గ్ థ్రెడ్స్ గురించి ఏమంటారు… ముఖ్యంగా డిజిటల్ యాడ్స్ బాగా తగ్గుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఫలితాలు కీలకంగా మారాయి. అలాగే రేపు, ఎల్లుండి ఫెడ్ భేటీ ఉంది. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. నాస్డాక్ 0.15 శాతం, డౌజోన్స్ 0.44 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు డాలర్ ఇండెక్స్ 101ని దాటడం విశేషం. డాలర్ బలపడినా.. క్రూడ్ మరో రెండు శాతంపైగా పెరిగింది. ఆసియా దేశాలు వాడే బ్రెంట్ క్రూడ్ ధర 82 డాలర్లు దాటింది. మరోవైపు బులియన్ ధరలపై ఒత్తిడి కన్పిస్తోంది.