For Money

Business News

స్వల్ప నష్టాల్లో నాస్‌డాక్‌

రేపు, ఎల్లుండి ఫెడరల్‌ బ్యాంక్‌ భేటీ అవుతోంది. వడ్డీ రేట్లు భారీగా పెంచుతారనే అంచనాల నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ స్వల్ప నష్టాలతో ట్రేడవుతోంది. నాస్‌డాక్‌ 0.46 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.32 శాతం, డౌజోన్స్‌ 0.28 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇవాళ యూరప్‌ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. జర్మనీ డాక్స్‌ అర శాతం వరకు లాభంతో ముగిసింది. బ్రిటన్‌ మార్కెట్లకు సెలవు. యూరో స్టాక్స్ 500 సూచీ స్థిరంగా ముగిసింది. డాలర్‌ స్థిరంగా ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ 109.5 వద్ద ట్రేడవుతోంది. క్రూడ్‌ ఆయిల్‌ తగ్గినట్లే తగ్గి.. ఇపుడు మళ్ళీ గ్రీన్‌లో ఉంది. బ్రెంట్‌ క్రూడ్‌ 0.44 శాతం లాభంతో 91.75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బులియన్‌ స్థిరంగా ఉంది.

Leave a Reply