For Money

Business News

ఆఫ్కాన్‌ ఐపీఓ 25న

ప్రముఖ నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ చెందిన ఆఫ్కాన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 25న ప్రారంభమై 29న ముగుస్తుంది. ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక షేరు రూ.440- రూ.463గా నిర్ణయించారు. మార్కెట్‌ నుంచి రూ. 5,430 కోట్లు సమీకరించేందుకు కంపెనీ పబ్లిక్‌ ఇష్యూకు వస్తోంది. ప్రీ-ఐపిఓ ప్లేస్‌మెంట్ కింద ప్రమోటర్‌ కంపెనీ అయిన గోస్వామి ఇన్‌ఫ్రాటెక్ రూ. 5,750 కోట్లను సమీకరించనుంది. ప్రీ-ఐపిఓ ద్వారా సమీకరించిన నిధులతో పాటు ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను రుణాలను తిరిగి చెల్లించడానికి, కంపెనీ మూలధన వ్యయం కోసం ఉపయోగిస్తారు.

Leave a Reply