For Money

Business News

ఆది గోద్రెజ్‌ కీలక నిర్ణయం

గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ పదవి నుంచి ఆది గోద్రెజ్‌ తప్పుకున్నారు. ఈ విషయాన్ని కంపెనీ ఇవాళ అధికారికంగా వెల్లడించింది. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి ఆయన ఛైర్మన్‌ పదవి నుంచి వైదొలగుతారని,ఛైర్మన్‌ ఎమిరేట్స్‌గా ఆయన కొనసాగుతారని పేర్కొంది. అలాగే గోద్రెజ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌గా ఆది గోద్రెజ్‌ కొనసాగుతారని పేర్కొంది. గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌కు ఇపుడు మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉన్న నదిర్‌ గోద్రెజ్‌ ఛైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పదవి చేపడుతారు.