హెరాయిన్ పట్టివేత: అదానీ కీలక నిర్ణయం
సెప్టెంబర్ 13వ తేదీన అదానీ గ్రూప్‌నకు చెందిన ముంద్రా పోర్టులో 3000 కిలోల హెరాయిన్ పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి అదానీ గ్రూప్‌పై అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 15వ తేదీ నుంచి ఇరాన్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి వచ్చే కన్సైన్మెంట్లను అదానీ గ్రూప్ పోర్టులు హ్యాండిల్ చేయవని అదానీ గ్రూప్ ప్రకటించింది. తదుపరి నిర్ణయం తీసుకునే వరకు దీన్ని అమలు పరుస్తామని పేర్కొంది. తమ గ్రూప్ పోర్టులతో పాటు తమ గ్రూప్ హ్యాండిల్ చేస్తున్న థర్డ్ పార్టీ పోర్టులకు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది.