విల్మర్‌కు వాటా అమ్మేసిన అదానీ

కనబడిన ప్రతి రంగంలోనూ ప్రవేశిస్తూ… అనేక కంపెనీలను ఎడాపెడా కొనుగోలు చేస్తూ వచ్చిన అదానీ గ్రూప్ తొలిసారి ఓ లిస్టెడ్ కంపెనీ నుంచి వైదొలగింది. అదానీ విల్మర్‌లో తన వాటాను విక్రయించాలని నిర్ణయించింది. ఈ కంపెనీలో అదానీ గ్రూప్‌నకు 44 శాతం వాటా ఉంది. తన వాటాను అదానీ కమాడిటీస్ ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజస్‌కు ఉంది. అలాగే విల్మర్ కంపెనీ కూడా సింగపూర్‌లోని తన అనుబంధ కంపెనీ అయిన లెన్స్ పీటీఈ ద్వారా అదానీ విల్మర్‌ను కంట్రోల్ చేస్తోంది. రుణాలను తిరిగి చెల్లించడంతో పాటు గ్రూప్ కీలక రంగాలపై ఫోకస్ పెట్టేందుకు అదానీ విల్మర్ నుంచి వైదొలగాలని అదానీ భావించినట్లు తెలుస్తోంది. నిబంధనల మేరకు 13 శాతం వాటాను అదానీ ఓపెన్ మార్కెట్‌లో విక్రయిస్తుంది. మిగిలిన 31 శాతం వాటాను ఒక్కో షేర్ రూ. 305 చొప్పున విక్రయించనుంది. అదానీ విల్మర్ షేర్ ఇవాళ రెండు శాతం నష్టంతో రూ. 323 వద్ద క్లోజైంది.