నిఫ్టి 50లోకి అదానీ ఎంటర్‌ప్రైజస్?
ఏటా రెండు సార్లు నిఫ్టి షేర్లను నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) పరిశీలిస్తుంది. షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో పాటు ఇతర అంశాలను పరిశీలించి… ప్రమాణాలకు అనుగుణంగా లేని షేర్లను నిఫ్టి50 నుంచి తొలగించి… వేరే షేర్లను తీసుకుంటుంది. వచ్చే నెల మూడో లేదా నాలుగో వారంలో నిఫ్టి50 షేర్లను ఎన్ఎస్ఈ సమీక్షించనుంది. ఈ సారి నిఫ్టి 50 నుంచి కోల్‌కతాకు చెందిన శ్రీసిమెంట్ షేర్‌ను తొలగించే అవకాశముంది. ఆ షేర్ స్థానంలో అదానీ ఎంటర్‌ప్రైజస్‌ను చేర్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఆగస్టు చివరికల్లా నిర్ణయం తీసుకుని.. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.