For Money

Business News

రైతుల కోసం సూపర్‌ యాప్‌

రైతుల కోసం ప్రత్యేకంగా ఓ సూపర్‌ యాప్‌ను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. రైతుల కోసం ఇపుడు ఉన్న వివిధ రకాల డిజిటిల్‌ సంస్థలను, మొబైల్‌ అప్లికేషన్స్‌ను కలిపి సమగ్రంగా ఓ సూపర్‌ యాప్‌ తేవాలని కేంద్ర వ్యవసాయ శాఖ యోచిస్తోంది. పరిశోధన రంగంలోకి వచ్చిన కొత్త మార్పులు, వాతావరణం, మార్కెట్‌లో తాజా ధరల వివరాలు, రైతులకు అందుబాటులో ఉన్న సేవలు, ప్రభుత్వ పథకాలు, సలహాలు.. వంటివి అన్నీ ఒకే యాప్‌లో అందుబాటులో ఉండేలా తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. కిసాన్‌ సువిధ, పుసా కృషి, ఎం కిసాన్‌, షేత్కారి మాసిక్‌ ఆండ్రాయిడ్ యాప్‌, ఫామ్‌ ఓ పెడియా, క్రాప్‌ ఇన్సూరెన్స్‌ ఆండ్రాయిడ్‌ యాప్‌, ఆగ్రి మార్కెట్‌, ఇఫ్కో కిసాన్‌, ఐకార్‌కు చెందిన కృషి జ్ఞాన్‌ వంటి వాటన్నింటిని కలిపి ఒకే యాప్‌ను తేవాలని భావిస్తోంది.