జెట్ ఎయిర్వేస్ టేకాఫ్‌కు లైన్ క్లియర్
జెట్ ఎయిర్వేస్కు ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్ (ఏఓసీ)ని డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) మంజూరు చేసింది. దీంతో విమాన సర్వీలు ప్రారంభించేందుకు జెట్ ఎయిర్వేస్కు అధికారిక అనుమతి లభించినట్లయింది. సాధారణ సర్వీసులు ప్రారంభిచేందుకు ఏఓసీ పొందడం చివరి దశ. విమాన సర్వీసుల ప్రారంభానికి సంబంధించి పూర్తి వివరాలు దశలవారీగా వెల్లడిస్తామని జెట్ ఎయిర్వేస్ పేర్కొంది. తొలి విమాన సర్వీసు జులై-సెప్టెంబర్ మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. తొలి సర్వీస్ ఢిల్లీ-ముంబై మధ్య నడపనున్నారు. ప్రస్తుతం జెట్ ఎయిర్ వద్ద 9 విమానాలు ఉన్నాయి. వీటిలో అయిదు బొయింగ్ 777లు కాగా, నాలుగు బోయిన్ 737 విమానాలు.