16000 పైన ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి అనుగుణంగా మార్కెట్ ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి 16000 స్థాయిని దాటింది. ప్రస్తుతం 16071 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 262 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టిలోని 50 షేర్లు లాభాల్లో ఉన్నాయి. కాని లాభాల్లో మెటల్స్ తిరుగులేని ఆధిపత్యం చూపిస్తున్నారు. ఇటీవల బాగా క్షీణించిన షేర్లు కూడా ఇవాళ మంచి రికవరీ మూడ్‌లో ఉన్నాయి. టాప్ 5 గెయినర్స్‌లో మూడు మెటల్స్ షేర్లు ఉండగా, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ ఉన్నాయి. ఫలితాలకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ పాజిటివ్‌గా స్పందిస్తోంది. మిడ్ క్యాప్ నిఫ్టి రెండు శాతంపైగా లాభంతో ఉంది. నిఫ్టి, నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి బ్యాంక్ సూచీలు 1.5 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి బ్యాంక్‌లో బ్యాంక్ ఆఫ్ బరోడా టాప్ గెయినర్‌గా నిలిచింది.