లాభాలన్నీ పాయే… మళ్ళీ నష్టాల్లో…
మిడ్ సెషన్ తరవాత మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైంది. ఆరంభంలో పటిష్ఠంగా ఉన్నా… యూరో మార్కెట్ల ప్రారంభానికి ముందు నిఫ్టి లాభాలన్నీ కోల్పోయింది. ఉదయం ఒకదశలో 16,399ని తాకిన నిఫ్టి ఆ తరవాత మిడ్ సెషన్‌లో 16,211 పాయింట్లను తాకింది. మిడ్ సెషన్‌లో దిగవ స్థాయి నుంచి కోలుకునే ప్రయత్నం చేసినా… చివరల్లో నష్టాలు తప్పలేదు. నిఫ్టి 16,240 పాయింట్ల వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 19 పాయింట్ల నష్టంతో ముగిసింది. నిఫ్టి నెక్ట్స్ తప్ప మిగిలిన ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి. అయితే అవన్నీ నామ మాత్రపు నష్టాలే. నిఫ్టి బ్యాంక్ ఒక్కటే దాదాపు అర శాతం నష్టంతో ముగిసింది. నిఫ్టిలో 29 షేర్లు నష్టాల్లో ముగిశాయి. యూరో మార్కెట్లు చాలా తక్కువ లాభాలతో ట్రేడవుతున్నాయి.
హైలెట్స్…
రెండు రోజుల లాభాలకు బ్రేక్
నిఫ్టి బ్యాంక్ కూడా మళ్ళీ నష్టాల్లోకి… 34,200 దిగువకు.
నిఫ్టి స్మాల్, మిడ్ క్యాప్ షేర్లు నష్టాల్లో
గత రెండు రోజుల్లో ఇండియా VIX ఏడు శాతంపైగా నష్టపోయింది.
నిఫ్టి ఫార్మా రెండో రోజు ఒక శాతంపైగా లాభపడింది.
గత రెండు రోజుల్లో నిఫ్టి ఎఫ్‌ఎంసీజీ మూడు శాతం పైగా పెరిగింది.
నిఫ్టి ఎఫ్‌ఎంసీజీ సూచీ 200 డీఎంఏ పైన ముగిసింది.
నిఫ్టి పీఎస్‌యూ బ్యాంక్ అండ్ పీఎస్‌ఈ ఒక శాతంపైగా నష్టపోయింది.