For Money

Business News

ఆకర్షణీయ లాభాలతో నిఫ్టి

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ఆరంభంలోనే 16,360 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 16,339 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 80 పాయింట్ల లాభంతో ఉంది. అన్ని ప్రధాన సూచీలు అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ 0.3 శాతం లాభంతో ఉంది. ఇటీవల భారీగా క్షీణించిన చాలా వరకు షేర్లు నిన్న, ఇవాళ భారీగా లాభపడ్డాయి. ఫలితాలు బ్రహ్మాండంగా ఉండటంతో భారతీ ఎయిర్‌టెల్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫైనాన్స్‌, దివీస్‌ ల్యాబ్‌లలో ఇవాళ కూడా మద్దతు కొనసాగుతోంది. నిన్న భారీగా పెరిగిన మెటల్స్‌లో స్వల్ప లాభాల స్వీకరణ కన్పిస్తోంది.