డే ట్రేడింగ్ … మూడు షేర్లు
మార్కెట్ నిన్న భారీ లాభాలతో ముగిసింది. ఇవాళ అదే స్థాయి లాభాలు అనుమానమే. మార్కెట్ స్థిరంగా ఉంటుందని అనలిస్టులు అంటున్నారు. ఈ నేపథ్యంలో టెక్నికల్‌గా ఇవాళ్టి ట్రేడింగ్‌కు ఈ మూడు షేర్లు పరిశీలించవచ్చు.
ఎస్బీఐ లెఫ్… ఈ షేర్‌ను రూ. 1060 నుంచి రూ. 1065 మధ్య కొనుగోలు చేయొచ్చని ఎస్ సెక్యూరిటీస్‌కు చెందిన అనలిస్ట్ అమిత్ త్రివేది అంటున్నారు. రూ. 1037 స్టాప్‌లాస్‌తో రూ. 1130 లేదా రూ. 1160 టార్గెట్‌గా ఉంచుకోవచ్చని అంటున్నారు. ఇక ఆయన సూచించిన మరో షేర్ గోద్రెజ్ కన్జూమర్. ఈ షేర్‌ను రూ. 815 ప్రాంతంలో కొనొచ్చని.. రూ.905 టార్గెట్ కోసం రూ. 770 స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలని అన్నారు. గరిష్ఠ స్థాయి నుంచి 42 శాతం పడిన ఈ షేర్ ఇపుడు కోలుకుంటుందోని, బ్రేకౌట్‌కు సిద్ధంగా ఉందని అంటున్నారు. ఎక్విరస్కు చెందిన కృతి షా అనే అనలిస్ట్ మదర్సన్ సుమి షేర్‌ను కొనేందుకు సిఫారసు చేస్తున్నారు. ఈ షేర్‌ను రూ. 125 ప్రాంతంలో కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. రూ. 140 లేదా రూ. 145 టార్గెట్ కోసం రూ. 121 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా.