For Money

Business News

16250పైన ముగిసిన నిఫ్టి

ఇవాళ స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి… సెషన్‌ మొత్తం క్రమంగా బలపడుతూ వచ్చింది. దాదాపు అన్ని రంగాల షేర్లకు మద్దతు అందింది. ముఖ్యంగా మెటల్స్‌ సూచీ ఏడు శాతంపైగా పెరిగింది. అధిక ద్రవ్యోల్బణం, అధిక క్రూడ్‌ ధరలతోపాటు డాలర్‌తో రూపాయి పతనాన్ని మార్కెట్‌ ఇవాళ పట్టించుకోలేదు. నిఫ్టి 16,284 స్థాయికి 16,259 పాయింట్ల వద్ద ముగిసింది. చివర్లో వచ్చిన షార్ట్‌ కవరింగ్‌ కారణంగా అనేక షేర్లు చివర్లో లాభాలతో ముగిశాయి. అన్ని ప్రధాన సూచీలు రెండు శాతంపైగా లాభంతో ముగిశాయి. నిఫ్టిలో కేవలం 2 షేర్లు మాత్రమే రెడ్‌లో ఉన్నాయి. మెటల్స్‌లోహిందాల్కో పది శాతం కోలుకోగా, వేదాంత 11 శాతంపైగా లాభపడింది. బ్యాంక్‌ షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.