ఎల్‌ఐసీ… రూ. 860ని తాకినా…
దేశంలో నంబర్ బీమా సంస్థ ఎల్‌ఐసీ షేర్లు కొద్దిసేపటి క్రితం రూ. 872 వద్ద లిస్టయ్యాయి. వెంటనే రూ. 860ని తాకింది. ప్రస్తుతం రూ. 914 వద్ద ట్రేడవుతోంది. ఆఫర్ ధరతో పోలిస్తే షేర్ రూ. 34నష్టంతో ట్రేడవుతోంది. సో.. షేర్లు పొందిన ప్రతి ఒక్కరికీ ఓపెనింగ్ నష్టాలు వచ్చాయి. కాని ప్రస్తుత ధర వద్ద నష్టాల నుంచి బయటపడినట్లే. ఎల్‌ఐసీ షేర్ రూ. 949లకు కేటాయించినా.. రీటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ. 904లకు షేర్లు అందాయి. పాలసీదారులకు రూ.889కి ఇచ్చారు. వీరందరికీ ఎల్‌ఐసీ నిరాశపర్చింది. ప్రి మార్కెట్‌లో ఈ షేర్‌రూ. 872 వద్ద ట్రేడైంది. ట్రేడింగ్ ప్రారంభమైన తరవాత రూ.860కి చేరినా.. తరవత కోలుకుంది.