నేడు డిస్కౌంట్‌తో ఎల్ఐసీ షేర్ల లిస్టింగ్?
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లు ఇవాళ స్టాక్ ఎక్సేంజీల్లో లిస్ట్ అవుతున్నాయి. బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో పది గంటల నుంచి ఈ షేర్లలో ట్రేడవుతాయి. కేంద్రం ఎల్ఐసీలో 22.13 కోట్ల షేర్లను (3.5 శాతం) ఐపీవోలో విక్రయించి రూ.20,557 కోట్లు సమీకరించిన విషయం తెలిసిందే. ఇన్వెస్టర్లకు కేటాయించే షేర్లకు ఒక్కోదానికి రూ.949 ధరను నిర్ణయించింది. రీటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ.45 డిస్కౌంట్ ఇవ్వగా, పాలసీ దారులకు రూ. రూ.60 డిస్కౌంట్‌తో షేర్లను ఆఫర్ చేశారు. దీంతో ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు రూ.45 డిస్కౌంట్‌తో రూ.904 ధరతో షేర్లను అలాట్ చేయగా, పాలసీ దారులకు రూ. 889ను కేటాయించింది. గ్రేమార్కెట్లో ఎల్ఐసీ షేర్లు రూ.16- రూ. 19ల డిస్కౌంట్‌తో లభిస్తున్నాయి. అయినా పాలసీదారులు, రీటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు డిస్కౌంట్‌తో ఆఫర్ చేసినందున నష్టం రాదు. అయితే మార్కెట్ పాజిటివ్‌గా ఉండే పక్షంలో ప్రీమియంలోకి వస్తుందేమో చూడాలి.