SBI: రెండు నెలల్లో రెండోసారి వడ్డీ పెంపు
మార్కెట్లోవడ్డీ రేట్లు క్రమంగా పెరుగుతున్నాయి. బ్యాంకులు ఒకేసారి కాకుండా క్రమంగా రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. తాజాగా ఎస్బీఐ రెండు నెలల్లో రెండోసారి వడ్డీ రేటును పెంచింది. నిధుల సమీకరణ వ్యయంను బట్టి వడ్డీ రేట్లను వసూలు చేసే విధానం (MCLR) ప్రకారం రుణాలపై వడ్డీ రేటును 0.10 శాతం పెంచింది. దీంతో ఒకటి, రెండు, మూడు నెలల MCLRను 6.75 శాతం నుంచి 6.85 శాతానికి పెంచింది ఎస్బీఐ. అలాగే ఆరు నెలల MCLR 7.15శాతానికి, ఏడాది MCLR 7.20 శాతానికి, రెండేళ్ల MCLR7.4 శాతానికి, మూడేళ్ల MCLR 7.5 శాతానికి చేరాయి. గత నెలలో ఆర్బీఐ రెపో రేటును 0.40 % పెంచడానికి ముందే ఎస్బీఐ MCLRను 0.10 శాతం పెంచింది. దీంతో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు బ్యాంక్ రుణాలపై MCLRను 0.20 శాతం పెరిగినట్లయింది.