For Money

Business News

డి మార్ట్‌ లాభం రూ.426 కోట్లు

మార్చితో ముగిసిన త్రైమాసికంలో దాదాపు అన్ని దిగ్గజ కంపెనీలు నిరాశాజనక ఫలితాలు ప్రకటిస్తున్నాయి. డీమార్ట్‌ కంపెనీ కూడా అదే బాటలో నడిచించింది. డీ-మార్ట్‌ పేరుతో రిటైల్‌ అవుట్‌లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ లిమిటెడ్‌ మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను రూ.426.75 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఆర్జించిన రూ.413.87 కోట్లతో పోలిస్తే 3.11 శాతం అధికం.ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 18.55 శాతం పెరిగి రూ.8,786.45 కోట్లుగా నమోదైంది. నిర్వహణ ఖర్చులు 18.71 శాతం పెరిగి రూ.8,210.13 కోట్లకు పెరగడంతో కంపెనీ లాభాలపై ఒత్తిడి పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.30,976.27 కోట్ల కన్సాలిడేటెడ్‌ ఆదాయంపై రూ.1,492.40 కోట్ల కన్సాలిడేటెడ్‌ నికర లాభాన్ని గడించింది.