For Money

Business News

రేపే ఎల్‌ఐసీ షేర్ల లిస్టింగ్‌

ఎల్‌ఐసీ ఐపీవో షేర్లు రేపు అంటే మంగళవారం లిస్ట్‌ అవుతాయి. ఒక్కో స్టాక్‌ ధరను గరిష్ఠంగా రూ.949గా నిర్ణయించినా… రిటైల్‌ ఇన్వెస్టర్లు, పాలసీహోల్డర్లకు రూ.904లకు కేటాయించారు. ఉద్యోగులకు మరో రూ.65 డిస్కౌంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రేపు లిస్టింగ్‌ ధర కీలకంక కానుంది. చాలా మంది ఉద్యోగులు, పాలసీదారులకు దరఖాస్తు చేసినన్ని షేర్లు లభించలేదు. రేపు షేర్లు డిస్కౌంట్‌కు లిస్టయినా.. వీరి నుంచి మద్దతు లభించవచ్చని భావిస్తున్నారు. తమకు రూ.904లకు షేర్లు దక్కినందున.. ఈ ధరపై రూ. 945 మధ్య షేర్లను కొనేందుకు రీటైల్‌ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపవచ్చు. ఒకవేళ ప్రీమియంతో లిస్ట్‌ అయితే మాత్రం అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశముంది. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లన్నీ బేర్ ఫేజ్‌లోకి వెళుతున్నారు. ఆకర్షణీయ ధర లభిస్తే ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపొచ్చు. స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు మాత్రం తొందరపడి
లిస్టింగ్‌ రోజునే షేర్‌లు కొనాల్సిన పనిలేదని అంటున్నారు. కొన్నాళ్ళు ఆగి ధర స్థిర పడిన తరవాత కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. కొనాల్సిన అవసరం లేదు. జీవిత బీమా మాదిరిగనే ఎల్‌ఐఐసీ షేర్లలో పెట్టబడి దీర్ఘకాలానికే. ఈ వ్యాపారం రోజువారీ మార్పులు ఉండవు. పైగా ప్రభుత్వం పెత్తనం ఉండనే ఉంది.