For Money

Business News

16000పైన ట్రేడవుతున్న నిఫ్టి

పది గంటల ప్రాంతంలో కాస్త ఒత్తిడికి లోనైనా చాలా వరకు 16000 పైన ఉండేందుకు నిఫ్టి ప్రయత్నిస్తోంది. సూచీలన్నీ భారీ లాభాల్లో ఉన్నాయి.. నిఫ్టి బ్యాంక్‌ తప్ప. నిఫ్టి బ్యాంక్‌ ఒక్కటే 0.5 శాతం లాభంతో ఉంది. నిఫ్టి 1.25 శాతం, నిఫ్టి నెక్ట్స్‌ 1.9 శాతం, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ 2.72 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్‌ ఉదయం నుంచి టాప్‌ గెయినర్స్‌లో నంబర్‌ వన్‌గా ఉంటోంది. ఈ షేర్‌ పది శాతం లాభంతో ఉంది. మెటల్స్‌ స్వల్ప ఒత్తిడి వస్తోంది. న్యూఏజ్‌ షేర్లలో జొమాటొ ఏకంగా పదిశాతం పైగా లాభపడింది. గోద్రేజ్‌ ప్రాపర్టీస్‌ ఏడు శాతం, నైకా ఆరున్నర శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. వేదాంత ఇవాళ నాలుగు శాతం మైనస్‌లో ఉంది. యూరో మార్కెట్లన్నీ ఒకశాతంపైగా లాభంతో ఉన్నాయి. అమెరికా ఫ్యూచర్స్‌ ఒక శాతంపైగా లాభంతో ఉండటంతో…మన మార్కెట్లు 16000పైనే క్లోజయ్యే అవకాశాలు ఉన్నాయి.