16000లకు చేరువలో…
సింగపూర్ నిఫ్టి సిగ్నల్స్‌కు అనుగుణంగా నిఫ్టి ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 15994ని తాకిన నిఫ్టి ఇపుడు 15940 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 126 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్ 358 పాయింట్ల లాభంతో ఉంది. నిఫ్టి, నిఫ్టి బ్యాంక్ నిఫ్టిలు 0.7 శాతం ప్రాంతంలో ట్రేడవుతున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా క్షీణించిన నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలు 1.5 శాతం పైగా లాభంతో ట్రేడవుతున్నాయి. లాభాలు తగ్గించుకున్న టాటా మోటార్స్ షేర్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఇటీవల ఈ షేర్ భారీగా క్షీణించింది కూడా. సన్‌ఫార్మా తరువాతి స్థానంలో ఉంది. ఫలితాలు నిరాశాజనకంగా ఉండటంతో ఎల్ అండ్ టీ షేర్ 1.5 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి టాప్ లూజర్స్‌లో టాప్‌లో ఉంది. ప్రధాన షేర్లలో గోద్రేజ్ ప్రాపర్టీస్ 5 శాతంపైగా లాభపడింది. మిడ్ క్యాప్‌లో ఏయూ బ్యాంక్ కూడా 5 శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది.