ఐపాడ్ ఇక చరిత్ర…
యాపిల్ కంపెనీకి ఆర్థికబలాన్ని ఇచ్చి… నిలబెట్టిన ఐపాడ్ చరిత్ర గర్భంలో కలిసిపోనుంది. రెండు దశాబ్దాల క్రితం స్టీవ్ జాబ్స్ దీన్ని మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఈ ఒక్క ఐపాడ్‌తో యాపిల్ కంపెనీ మార్మోగిపోయింది. ఆర్థికంగా నిలదొక్కునే అవకాశం కల్పించింది. ఒక్క మొబైల్ కనెక్షన్ తప్ప దాదాపు అన్ని రకాల సౌకర్యాలతో సంగీత ప్రియులను అలరించిన ఐప్యాడ్ ఉత్పత్తి ఆపివేయాలని యాపిల్ నిర్ణయించింది. ఐప్యాడ్ కాస్త.. యాపిల్ మొబైల్ ఫోన్‌గా మారడంతో… ఐప్యాడ్ ఆదరణ తగ్గింది. ఐపాడ్ ద్వారా ఆనందిస్తున్న మ్యూజిక్ ఫీచర్లను తమ ఐఫోన్, యాపిల్ వాచ్, హోవ్పాడ్ మినీ, మ్యాక్, ఐప్యాడ్, యాపిల్ టీవీలకూ అనుసంధానించడంతో ఇక ఐప్యాడ్ అక్కర్లేని స్థితి వచ్చేసింది.
తాజాగా అప్డేట్ చేసిన వెర్షన్ 2019లో వచ్చింది. తర్వాత కొత్త వెర్షన్లను విడుదల చేయలేదు. సో ఇపుడు మార్కెట్లో 2019 వెర్షన్ మాత్రమే ఉంటుంది. దీని ఉత్పత్తి ఆపేస్తున్నారు. కాబట్టి.. ఇపుడు స్టాక్ ఉన్న ఐప్యాడ్లే చివరివి.