For Money

Business News

స్థిరంగా ట్రేడవుతున్న నిఫ్టి

సింగపూర్‌ నిఫ్టి స్థాయిలో నష్టాల్లో ప్రారంభమైన నిఫ్టి.. కొన్ని క్షణాల్లోనే లాభాల్లోకి వచ్చేసింది. ఆరంభంలో 16243ని తాకిన నిఫ్టి ఇపుడు 16330 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే 29 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 129 పాయింట్ల లాభంతో 54600 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టిలో 36 షేర్లు గ్రీన్‌లో ఉన్నాయి. అన్ని ప్రధాన సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీలు 0.8 శాతం లాభంతో ట్రేడవుతున్నాయి. మార్కెట్‌లో క్రూడ్‌ ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. రాత్రి క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించడంతో నిఫ్టిలో ఓఎన్‌జీసీ టాప్‌ లూజర్‌గా నిలవగా, ఏషియన్‌ పెయింట్స్‌ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఏషియన్‌ పెయింట్స్‌ మూడు శాతం పెరగడం విశేషం. ఐటీ షేర్లు కాస్త బలహీనంగా కన్పిస్తున్నాయి. న్యూజ్‌ ఏజ్‌ షేర్లలో ఒత్తిడి కొనసాగుతోంది. డిఎల్‌ఎఫ్‌ రెండున్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. వడ్డీ రేట్లు పెరిగినా… డీఎల్‌ఎఫ్‌తో పాటు గోద్రెజ్‌ ప్రాపర్టీ షేర్లను అనలిస్టులు రెకమెండ్‌ చేస్తున్నారు.