NIFTY TRADE: 16,180 కీలకం
గత కొన్ని రోజుల నుంచి మన మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్ల పతనం నుంచి తప్పించుకుంటూ వచ్చింది. ఆరంభంలో మార్కెట్ ఎంత క్షీణించినా.. క్లోజింగ్‌కల్లా స్వల్ప నష్టాలతో ముగుస్తోంది. అమెరికా మార్కెట్లు దాదాపు రెండేళ్ళ కనిష్ఠ స్థాయిలో ట్రేడవుతున్నాయి. మన మార్కెట్లు ఇంక గత మార్చి కనిష్ఠ స్థాయిలను కూడా తాకలేదు. అమెరికా మార్కెట్ల కంటే సురక్షితంగా మన మార్కెట్లు ట్రేడవుతున్నాయి. కార్పొరేట్ ఫలితాలు పూర్తి కావొస్తున్నాయి… అలాగే ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్ కూడా పూర్తయింది. ఇక టెక్నికల్‌గా చూస్తే నిఫ్టికి 16180 – 16210 మధ్య మద్దతు అందాలి. లేని పక్షంలో నిఫ్టి 16130 స్థాయిన తాకే ప్రమాదముంది. నిఫ్టి 16285 దాటితే అమ్మకాల ఒత్తిడి వచ్చే అవకాశముంది.ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్ ఇవి…
అప్ బ్రేకౌట్ 16467
రెండో ప్రతిఘటన 16422
తొలి ప్రతిఘటన 16392
నిఫ్టికి కీలకం 16285
తొలి మద్దతు 16211
రెండో మద్దతు 16182
డౌన్ బ్రేకౌట్16137