పుట్స్ కొనండి..
నిఫ్టికి అత్యంత కీలక స్థాయి 16400 అని, ఆ స్థాయి దిగువకు వచ్చిన తరవాత నిఫ్టి తదుపరి టార్గెట్‌పై ఎవరికీ అంచనాలు లేవని… అయితే నిఫ్టిలో మరింత మరో పతనం ఖాయమని అంటున్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుదర్శన్ సుఖాని అన్నారు. ఇవాళ సీఎన్‌బీసీ టీవీ18లో ఆయన మాట్లాడుతూ… మార్కెట్ ప్రధాన స్థాయిని కోల్పోయిందని అన్నారు. నిఫ్టి ఇక్కడే కొనసాగవచ్చని లేదా 16000లకు చేరొచ్చని లేదా ఇంతకమునుపటి ప్రధాన మద్దతు స్థాయి 15800 స్థాయికి కూడా చేరవచ్చని ఆయన అంటున్నారు. ఇలాంటి సమయంలో పుట్స్ కొనడం తప్ప మరో మార్గం లేదన్నారు. స్వల్ప కాలిక కంటే దీర్ఘాకాలిక పుట్స్ కొనమని ఆయన సలహా ఇచ్చారు. మరో స్టాక్ మార్కెట్ మితీష్ టక్కర్ కూడా ఇదే సలహా ఇచ్చారు. రిలీగేర్ కు చెందిన మురళీధరన్ కూడా ఇదే సలహా ఇచ్చారు. నిఫ్టి ఏమాత్రం పెరిగినా అట్ ద మనీ 16,000 పుట్ కొనుగోలు చేయమని ఆయన సలహా ఇచ్చారు. నిఫ్టి చాలా బలహీనంగా ఉందని, నిఫ్టి మరింత పతనం కావడం వినా మరో మార్గం లేదని ఆయన అంటున్నారు.