For Money

Business News

LIC IPO: అయిదో రోజు ఆదరణ అంతంతే

ఇప్పటి వరకు ఏ పబ్లిక్‌ ఆఫర్‌ లేనివిధంగా ఆదివారం కూడా దాదాపు 25,000 బ్యాంకు బ్రాంచీలు ఓపెన్‌ చేసినా… ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఆఫర్‌కు ఆదరణ అంతంత మాత్రమే ఉంది. నిన్న నాలుగో రోజు పబ్లిక్‌ ఆఫర్‌కు 1.66 రెట్లు సబ్‌స్క్రప్షన్‌ రాగా ఇవాళ అంటే అయిదో రోజు నాటికి 1.79 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రప్షిన్‌ వచ్చింది. పబ్లిక్‌ ఆఫర్‌ రేపు క్లోజ్‌ కానుంది. దాదాపు అన్ని విభాగాలు సబ్‌స్క్రయిబ్‌ అయినా… క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్ (QIB) కోటా ఇవాళ కూడా పూర్తి కాలేదు. నిర్ణీత కోటాలో 67 శాతం మాత్రమే సబ్‌స్క్రప్షన్‌ వచ్చింది. ఇవాళ ఈ కోటా కింద ఎలాంటి దరఖాస్తు రానట్లుంది. అయితే రేపు కచ్చితంగా ఈ కోట్ల పలు రెట్లు ఓవర్‌సబ్‌ స్క్రయిబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే QIBలు సాధారణంగా చివరి రోజున దరఖాస్తు చేస్తారు. ప్రభుత్వం 16.2 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయగా, 29.07 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. అన్నింటి కంటే అధికంగా పాలసీదారుల కోటా రికార్డు స్థాయిలో 5.04 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ అయింది. ఉద్యోగుల కోటా కూడా 3.79 రెట్లు బుక్‌ అయింది. రిటైల్‌ ఇన్వెస్టర్ల కోటా సబ్‌స్క్రిప్షన్‌ ఇవాళ 1.59 రెట్లకు చేరింది.