L&T ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ విలీనం
కాదు, లేదు లేదంటూనే.. ఎల్ అండ్ టీ గ్రూప్ ఇవాళ తన రెండు ఐటీ అనుబంధ కంపెనీల విలీనాన్ని ప్రకటించింది. శుక్రవారం జరిగిన బోర్డు సమావేశాల్లో ఎల్ అండ్‌టీ ఇన్ఫోటెక్, మైండ్‌ట్రీ కంపెనీల విలీనానికి ఆమోదం తెలిపాయి. ఇది పూర్తిగా షేర్ల విలీనం తరవాత కొత్త కంపెనీ ఏర్పడుతుంది. నగదు లావాదేవీలు ఉండవు. మైండ్‌ట్రీకి చెందిన ప్రతి వంద షేర్లకు ప్రతిగా ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ 73 షేర్లు కేటాయిస్తారు. ఈ షేర్ల ముఖవిలువ రూ.1.. కొత్త ఏర్పడే కంపెనీ పేరు ఎల్టీఐ మైండ్‌ట్రీ. కొత్త కంపెనీ పగ్గాలను డీసీ చటర్జీ చేపడుతారు. విలనీం తరవాత 350 కోట్ల డాలర్ల కంపెనీ ఏర్పడుతుంది. విలీనం తరవాత కూడా రెండు కంపెనీలు స్వతంత్రంగా పనిచేస్తాయి. విలీనం ప్రక్రియ పూర్తి కావడానికి 9 నుంచి 12 నెలలు పడుతుంది. ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ జలోనా రాజీనామా చేశారు. ఆయన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. విలీనం తరవాత కొత్త కంపెనీలో ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ వాటా 60.99 నుంచి 68.73 శాతానికి చేరుతుంది.
L&T has called for a press briefing at 4 pm today. L&T’s Group Chairman will be addressing the media. The company will address its merger plans with Mindtree. Watch the press briefing live here. #Mindtree #PressConference https://t.co/DE8sAwdvwv
— Moneycontrol (@moneycontrolcom) May 6, 2022