16400 దిగువన నిఫ్టి
సింగపూర్ నిఫ్టి స్థాయిలోనే భారీ నష్టాలతో నిఫ్టి ప్రాంభమైంది. ప్రధానం బ్యాంక్ నిఫ్టి, ఐటీ, ఎన్బీఎఫ్సీ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. నిఫ్టిలో కేవలం రెండు షేర్లు నామమాత్రపు లాభాలతో ఉంది. నిఫ్టి ఓపెనింగ్‌లోనే 16,386 పాయింట్లను తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా కోలుకుని ఇపుడు 16394 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి 1.73 శాతం నష్టపోగా, ఇతర ప్రధాన సూచీలు 2 శాతం నుంచి 2.6 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. నిఫ్టి దిగువ స్థాయిలో ప్రస్తుతానికి నిలకడగా ఉంది. నిఫ్టి టాప్ లూజర్స్‌లో అపోలో హాస్పిటల్స్ ఉండటం విశేషం. ఈ షేర్ నాలుగు శాతం దాకా నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి నెక్స్ట్లో ఒక్క షేరు కూడా లాభాల్లో లేదు. అన్నీ నష్టాల్లో ఉన్నాయి. నిఫ్టి మిడ్‌క్యాప్ షేర్లలో వోల్టాస్ టాప్‌లో ఉంది. ఈ షేర్ ఇవాళ 9 శాతంపైగా నష్టపోయింది.