For Money

Business News

రూ. 950 అన్నారు.. రూ. 487కు ఇస్తున్నారు

ప్రముఖ లాజిస్టిక్‌ కంపెనీ డెల్హివరి లిమిటెడ్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 11న ప్రారంభం కానుంది. 13వ తేదీన ముగుస్తుంది. వాస్తవానికి ఈ ఏడాది జవనరిలో ఈ ఇష్యూను రూ.950లకు ఆఫర్‌ చేయాలని అనుకుంది. తరవాత మార్కెట్‌ పరిస్థితులు బాగా లేవని ఇష్యూ వాయిదా పడింది. ఇపుడు పబ్లిక్‌ ఆఫర్‌ ప్రకటించింది. అయితే కంపెనీ వ్యాల్యూయేషన్‌ భారీగా తగ్గించేశారు. ఇష్యూ ధర శ్రేణి రూ. 462-487గా చెబుతున్నారు. అనధికార మర్కెట్‌లో ఈ షేర్‌ రూ. 550 నుంచి రూ.600 మధ్య ట్రేడ్‌ అవుతోంది. అంటే అనధికార మార్కెట్‌ ధరకన్నా 19 శాతం తక్కువకు ఈ షేర్‌ లభిస్తోందన్నమాట. అనధికార మార్కెట్‌లో ఈ షేర్లను జనవరిలో కొన్నవారు ఇపుడు షాక్‌తిన్నారు. దాదాపు 40 శాతంపైగా తగ్గడంతో భారీగా నష్టపోయాయి. గత ఏడాది ఈ షేర్‌కు మంచి క్రేజ్‌ ఉండేది. దీంతో చాలా మంది ఇన్వెస్టర్లు అనధికార మార్కెట్‌లో అపుడు కూడా కొన్నారు. అయితే ఒక్కసారిగా ఆ క్రేజ్‌ తగ్గిపోవడంతో… ఇది వరకే కొన్నవారు అడ్డంగా బుక్‌ అయ్యారు.