For Money

Business News

NIFTY TRADE: 16850 కీలకం

నిఫ్టి ఇవాళ 150 పాయింట్ల లాభంతో ప్రారంభం కానుంది. నిన్నటి క్రితం ముగింపు 16,677. దాదాపు నిన్నటి కనిష్ఠ స్థాయికి దగ్గర్లో నిఫ్టి ముగిసింది. నిఫ్టి ఇవాళ 16,800పైన ప్రారంభం కానుంది. నిఫ్టి లెవల్స్‌ చూస్తే నిఫ్టికి 16850 ప్రాంతంలోనే అమ్మకాల ఒత్తిడి రానుంది. షార్ట్‌ కవరింగ్‌ రావాలి… నిఫ్టి భారీగా పెరగాలంటే మాత్రం నిఫ్టి 16950ని దాటాలని టెక్నకల్‌ అనలిస్టులు అంటున్నారు. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా ఉంది. నిఫ్టిలో ఇవాళ కూడా ఒత్తిడి లేదా లాభాల స్వీకరణ వస్తే నిఫ్టి నిన్నటి క్లోజింగ్‌ వద్ద నిలబడుతుందా అన్నది చూడాలి. నిన్నటి క్లోజింగ్‌ దిగువకు వస్తే మాత్రం ఒత్తిడి మరింత పెరగనుంది. టెక్నికల్‌గా నిఫ్టిటకి 16522 ప్రాంతంలో మద్దతు ఉంది. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ 16974
రెండో ప్రతిఘటన 16889
తొలి ప్రతిఘటన 16834
నిఫ్టికి కీలకం 16811
తొలి మద్దతు 16522
రెండో మద్దతు 16466
డౌన్‌ బ్రేకౌట్‌ 16382