బ్యాంకుల అండతో కోలుకున్న నిఫ్టి
ప్రపంచ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా మన మార్కెట్లు దాదాపు స్థిరంగా ముగిశాయనే చెప్పాలి. ఉదయం 16,924కు క్షీణించిన నిఫ్టి తరవాత కోలుకుంటూ వచ్చింది. ఉదయం మార్కెట్ అనలిస్టులు ఊహించినట్లే బ్యాంకులు నిఫ్టికి అండగా నిలిచాయి. దీంతో మిడ్ సెషన్‌లో యూరో మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నా…మన మార్కెట్లు పటిష్ఠంగా ఉన్నాయి. 2.15 గంటల సమయంలో 16,975కు క్షీణించినా… క్లోజింగ్ సమయంలో వచ్చిన షార్ట్ కవరింగ్ నిఫ్టి 17,092ను తాకి 17,069 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 33 పాయింట్ల నష్టంతో ముగిసింది. మార్కెట్ కోలుకున్నా మిడ్ క్యాప్ నిఫ్టి 0.6 శాతం నష్టంతో క్లోజైంది. బ్యాంక్ నిఫ్టి 0.2 శాతం లాభంతో క్లోజైంది. టాప్ గెయినర్స్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్ నిలిచింది. ఐషర్ మోటార్స్ 3.43 శాతం నష్టంతో ముగిసింది.