For Money

Business News

విన్‌ ఎయిర్‌ చేతికి ట్రూజెట్‌

నాగ్‌పూర్‌కు చెందిన విన్‌ ఎయిర్‌ అనే కంపెనీ ట్రూజెట్‌ బ్రాండ్‌తో విమానాలు నడిపే టర్బో మెఘా ఎయిర్‌వేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో మెజారిటీ వాటా తీసుకోనుంది. ట్రూ జెట్‌లో 79 శాతం వాటాను రూ. 200 కోట్లకు విన్‌ ఎయిర్‌ (We Indian Nationals) తీసుకోనుంది. ఈ మేరకు ఈ రెండు కంపెనీల మధ్య ఏప్రిల్‌ 26న ఒప్పందం కుదిరింది. విన్‌ ఎయిర్‌ నాగ్‌పూర్‌కు చెందిన కంపెనీ అయినా.. ఇపుడు హైదరాబాద్‌ కేంద్రంగా విమానాలు నడుపుతోంది. టేకోవర్‌ తరవాత కూడా ట్రూజెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఉమేష్‌ వంకాయలపాటి కొనసాగుతారు. విన్‌ ఎయిర్‌ తరఫున ఆయన కంపెనీ ఛైర్మన్‌ శామ్యూల్‌ రంజన్‌ తిమోతి సంతకం చేశారు. డిసెంబర్‌ కల్లా తమ కంపెనీ వద్ద 17 విమానాలు ఉంటాయని, మరో మూడు బ్యాకప్‌ విమనాలు ఉంటాయని చెప్పారు. విన్‌ ఎయిర్‌ ఏవియేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఆర్యన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌తో అనుబంధం ఉంది.