లాభాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగియడంతో ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. కంపెనీల ఫలితాలకు అక్కడి మార్కెట్ కావడం వల్ల ఆ ఉత్సాహం ఆసియా మార్కెట్లలో కన్పించడం లేదు. పైగా మార్కెట్ ముగిసిన తరవాత వచ్చిన యాపిల్, అమెజాన్ కంపెనీల ఫలితాలు నిరాశజనకంగా ఉన్నాయి. నాస్‌డాక్ ఫ్యూచర్ అపుడే నష్టాల్లో ఉంది. దీంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ ఒక్కటే 1.75 శాతం లాభంతో ట్రేడవుతోంది. చైనా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా ఏ50 సూచీ 0.8 శాతం నష్టంలో ఉండగా, ఇతర సూచీలు గ్రీన్‌లో ఉన్నాయి. ఇక హాంగ్‌సెంగ్ సూచీ 0.8 శాతం నష్టంతోఉంది. తైవాన్ మార్కెట్ ఒక శాతంపైగా లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 90 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. నిఫ్టి కూడా లాభాల్లో ప్రారంభమయ్యే అవకాశం అధికంగా ఉంది.