అమెరికాకు జీడీపీ షాక్
అమెరికా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) అనూహ్యంగా రివర్స్ గేర్లో పడింది. 2020లో లాక్డౌన్ విధించిన తరవాత తొలిసారి జీడీపీ క్షీణించింది. విశ్లేషకులు మార్చితో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 1.1 శాతం ఉంటుందని అంచనా వేశారు. అయితే మైనస్ 1.4 శాతం (వార్షిక ప్రాతిపదికన) నమోదైంది. దేశీయంగా వినియోగదారుల వ్యయం భారీగా ఉన్నా అంతర్జాతీయ అంశాలు జీడీపీని దెబ్బతీశాయి. వాణిజ్య లోటు పెరగడం ప్రధాన కారణమని అమెరికా వాణిజ్య అధికారులు అంటున్నారు. ఇది తాత్కాలికమేనని, మున్ముందు సవరించిన డేటా ఇంతకన్నా అధికంగా ఉంటుందని ఆర్థిక వేత్తలు అంటున్నారు. భారీ ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఫెడలర్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో జీడీపీ ఈ స్థాయిలో పడటంతో స్టాక్ మార్కెట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.