ప్రావిజన్స్ తగ్గాయి… లాభం పెరిగింది
మార్చితో ముగిసిన త్రైమాసికంలో యాక్సిస్ బ్యాంక్ బాగా రాణించింది. ప్రావిజన్స్కు కేటాయింపులు బాగా తగ్గడంతో నికర లాభం భారీగా పెరిగింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 4117 కోట్ల నికరలాభం ప్రకటించింది. గత ఏడాది ఇదేకాలంలో నమోదైన రూ. 2677 కోట్ల నికర లాభంతో పోలిస్తే 54 శాతం పెరిగిందన్నమాట. నికర వడ్డీ ఆదాయం కూడా 16.7 శాతం పెరిగి రూ.8819 కోట్లకు చేరింది. వడ్డీయేతర ఆదాయం 19.3 శాతం పెరిగి రూ.4223 కోట్లు. బ్యాంకు ఇచ్చిన రుణాల మొత్తం కూడా 15 శాతం పెరిగి రూ. 7.07 లక్షల కోట్లకు చేరినట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. ఇందులో రీటైల్ రుణాల వాటా 57 శాతం. ఈ త్రైమాసికంలో ప్రావిజన్స్ కోసం కేటాయింపులు 54 శాతం తగ్గి రూ. 987 కోట్లకు చేరింది.