స్థిరంగా సింగపూర్ నిఫ్టి
రాత్రి వాల్‌స్ట్రీట్ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యాయి. మూడు సూచీలు ఒక శాతం దాకా లాభపడిన మూడు సూచీలు… క్లోజింగ్ కల్లా డీలా పడ్డాయి. నాస్డాక్ నష్టాల్లో క్లోజ్ కాగా, ఎస్ అండ్ పీ 500, డౌజోన్స్ సూచీలు నామ మాత్రపు లాభాలతో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. దాదాపు అర శాతం వరకు లాభాలతో ట్రేడవుతున్నాయి. జపాన్ నిక్కీ 0.6 శాతం, హాంగ్‌సెంగ్ 0.5 శాతం లాభంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి ఉదయం నష్టాల్లో ప్రారంభమై.. ఇపుడు దాదాపు క్రితం ముగింపు స్థాయిలోనే ఉంది. ఈ నేపథ్యంలో నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇవాళ నిఫ్టి వీక్లీ, డెరివేటివ్స్ క్లోజింగ్ ఉంది.