నష్టాల నుంచి తేరుకుంటున్న నిఫ్టి
సరిగ్గా మిడ్ సెషన్‌కు ముందు నిఫ్టిలోభారీ ఒత్తిడి వచ్చింది. ఒకదశలో 16958కి క్షీణించిన నిఫ్టి … వెంటనే కోలుకుని ఇపుడు 17041 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దీనికి ప్రధాన కారణం.. నిఫ్టికి దిగువ స్థాయిలో మద్దతు అందడం. అలాగే యూరో మార్కెట్లు గ్రీన్లో ప్రారంభం కావడంతో పాటు అమెరికా ఫ్యూచర్స్ కూడా భారీ లాభాల్లో ఉన్నాయి. డౌజోన్స్ ఒక శాతంపైగా లాభంతో ఉంది. అమెరికా భారీ నష్టాల దృష్ట్యా యూరో మార్కెట్లు కీలకం కానుంది. ఇవాళ కూడా మార్కెట్‌కు రిలయన్స్ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. హీరో మోటోకార్ప్, ఏషియన్ పెయింట్స్ నుంచి కూడా గట్టి మద్దతు లభించింది. బజాజ్ ట్విన్స్ ఇవాళ భారీ నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ 6 శాతం పగైఆ, బజాజ్ ఫిన్ సర్వ్ నాలుగు శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. బ్యాంక్ నిఫ్టి కూడా ఒకశాతంపైగా నష్టంతో ఉంది. రేపు డెరివేటివ్స్ క్లోజింగ్ ఉన్న నేపథ్యంలో నిఫ్టి ఇవాళ్టి ముగింపు కీలకం కానుంది.