For Money

Business News

‘ఈ షేర్‌ 77 శాతం ప్రతిఫలం’

మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎం అండ్‌ ఎం) కంపెనీ షేర్‌ రానున్న రెండేళ్ళలో 77 శాతం ప్రతిఫలం ఇస్తుందని ఐడీబీఐ క్యాపిటల్‌ అంచనా వేస్తోంది. ఇటీవల ఈ కంపెనీపై కవరేజీ ప్రారంభించినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఎం అండ్‌ ఎం నుంచి ఈ స్థాయి ప్రతిఫలం రావడానికి కొన్ని కారణాలను ఆ కంపెనీ పేర్కొంది. ఒకటి కంపెనీ వృద్ధి, వ్యాల్యూ క్రియేషన్‌ విషయంలో కంపెనీ భారీ అండదండలు కాగా రెండోది ఆటో రంగం వ్యాపారంలో గట్టి రికవరి. ఇక 22-24 ఆర్థిక సంవత్సరానికి 31% PAT CAGR సాధించడం, ఈవీ రంగంలో వ్యాల్యూ అన్‌లాక్‌ చయడం. మరింత పెట్టుబడి అందించడంతో పాటు గ్రూప్‌ నిర్మాణాన్ని మరింత సింపుల్‌ చేయడమని ఐడీబీఐ క్యాపిటల్‌ పేర్కొంది. ఎం అండ్‌ ఎం కంపెనీ వ్యాల్యూయేషన్‌ లెక్కించేటపుడు… కంపెనీ ఆటో బిజినెస్‌, వ్యవసాయ రంగ సంబంధ వాహనాల బిజినెస్‌ను విడిగా లెక్కించినట్లు కంపెనీ పేర్కొంది. ఈవీ వ్యాపారాన్ని పరిగణనలోకి తీసుకోవడంతో పాటు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌పై కంపెనీ పెడుతున్న పెట్టుబడులను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది.