For Money

Business News

NIFTY TODAY: 16980 కీలకం

అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంశం మార్కెట్‌లో చాలా రోజుల నుంచి నడుస్తోంది. మార్కెట్‌ పడిన ప్రతిసారీ ఇదే సాకుగా చెబుతున్నారు. ముఖ్యంగ టెక్‌, ఐటీ షేర్లలో ఒత్తిడికి ఇదే కారణమని చెబుతూ వచ్చారు. అయితే ఇదెంత వరకు అన్న అంశంపై క్లారిటీ లేకుండా పోతోంది. మెజారిటీ ఇన్వెస్టర్లు వడ్డీ అంశాన్ని మార్కెట్‌ పూర్తిగా డిస్కౌంట్‌ చేసిందని.. కేవలం ఇపుడు కార్పొరేట్‌ ఫలితాలను బట్టి స్పందిస్తోందని కొందరు అనలిస్టలు అంటున్నారు. ఈ వారం అమెరికా కంపెనీల ఫలితాలతో ఒక ట్రెండ్‌ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఫ్టి ఇవాళ 17000 దిగువకు చేరనుంది. ఇవాళ నిఫ్టికి 16980 దిగువన మద్దతు అందుతుందని భావిస్తున్నారు. నిఫ్టి లెవల్స్‌…

అప్‌ బ్రేకౌట్‌ 17238
రెండో ప్రతిఘటన 17127
తొలి ప్రతిఘటన 17502
నిఫ్టికి కీలకం 16980
తొలి మద్దతు 16946
రెండో మద్దతు 16928
డౌన్‌ బ్రేకౌట్‌ 16867