ఈ వారం వాల్‌స్ట్రీట్‌లో ర్యాలీ?
అమెరికా ఇన్వెస్టర్లు వచ్చే వారం కార్పొరేట్ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఫెడ్ అరశాతం వడ్డీ పెంపును మార్కెట్ డిస్కౌంట్ చేసినట్లు కన్పిస్తోంది. ఇపుడు అనలిస్టుల దృష్టి అంతా వచ్చే కంపెనీలు ముఖ్యంగా ఐటీ, టెక్ కంపెనీలు ప్రకటించే ఫలితాలపై ఉంది. వచ్చే మంగళవారం మార్కెట్ ముగిసిన తరవాత మైక్రోసాఫ్ట్, ఆల్ఫాబెట్ (గూగుల్) తమ ఫలితాలను ప్రకటించనున్నాయి. బుధవారం మార్కెట్ తరవాత మెటా ప్లాట్‌ఫామ్స్ మాతృసంస్థ ఫేస్బుక్ ఫలితాలను ప్రకటిస్తుంది. అలాగే గురువారం మార్కెట్ ముగిసిన తరవాత యాపిల్, అమెజాన్ కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తాయి. గతవారం నెట్‌ఫ్లిక్స్ ఫలితాలు మార్కెట్‌ను కుదిపేశాయి. దాదాపు 40 శాతం దాకా ఆ షేర్ నష్టపోయింది. దీంతో వచ్చే వారం కార్పొరేట్ ఫలితాలు మార్కెట్ దిశను నిర్ణయించనున్నాయి. ఫలితాలు బాగుంటే… మార్కెట్లో ర్యాలీకి అవకాశముంటుందని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అమెరికా మార్కెట్లోని ప్రధాన సూచీలు కీలక మద్దతు స్థాయికి దిగువకు వచ్చేశాయి. గతవారం మూడు ట్రేడింగ్ సెషన్స్‌లో 6 శాతంపైగా క్షీణించింది. డౌజోన్స్ గత వారం చివరి రెండు రోజుల్లో 3.8 శాతం క్షీణించింది. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఫలితాలు మెరుగ్గా ఉంటే మార్కెట్లో ర్యాలీ వస్తుందని భావిస్తున్నారు.