17020 వద్ద నిఫ్టికి మద్దతు?
గత వారం రోజులు నిఫ్టి 200 రోజుల చలన సగటు (DMA) ఎగువన నిలబడ లేకపోతోంది. నిఫ్టి 200 DMA 17193. ఈ స్థాయి పైకి వెళ్ళినా లాభాలు నిలబడం లేదు. గత శుక్రవారం నిఫ్టి 200 DMA కు దిగువన 17171 వద్ద ముగిసింది. సెషన్ ద్వితీయార్థంలో భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. సోమవారం నిఫ్టికి 17100 లేదా 17020 మద్దతు స్థాయిలుగా నిలబడనున్నాయి. పెరిగితే 17200 లేదా 17340 వద్ద గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశముంది. డైటీ MACD బుల్లిష్‌గా ఉన్నా.. సిగ్నల్ లైన్‌కు దిగువన ఉంది. RSI 46.87 వద్ద ఉంది. RSI స్థిరంగా ఉండటం వల్ల మార్కెట్లో అయోమయం నెలకొంది. నిఫ్టి కోలుకునే విధంగా ఇంకా సిగ్నల్ రావడం లేదు. ఒకవేళ పెరిగితే లాభాల స్వీకరణకు ఛాన్స్ ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండటం మంచిది. వచ్చే వారం కూడా మన మార్కెట్లను అమెరికా మార్కెట్లు శాసించనున్నాయి. ఫలితాలు ప్రకటించే కంపెనీలు తప్ప.