లాభాల్లో సింగపూర్ నిఫ్టి
రాత్రి అమెరికా మార్కెట్లు స్థిరంగా ముగిశాయనే చెప్పాలి. నెట్ఫ్లిక్స్ రాత్రి 35 శాతంపైగా నష్టంతో ముగిసింది. దీంతో ఇతర ఐటీ, టెక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఫేస్బుక్ 7శాతం నష్టపోయింది. అలాగే టెస్లా, అమెజాన్, ఎన్విదా ఒక మోస్తరు నష్టాలో ముగిశాయి. దీంతో నాస్డాక్ 1.22 శాతం క్షీణించింది. ఎస్ అండ్ పీ 500 సూచీలో మార్పుల్లేవు. డౌజోన్స్ మాత్రం 0.71 శాతం లాభంతో ముగిసింది. డాలర్ రాత్రి క్షీణించినా.. ఇపుడు గ్రీన్లో ఉంది. బ్రెంట్ క్రూడ్ కూడా108 ప్రాంతంలో ట్రేడవుతోంది.ఇక ఆసియా షేర్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ ఒకశాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. చైనా, హాంగ్ కాంగ్ మార్కెట్లలో పెద్ద మార్పు లేదు. కోస్పి ఒక్కటే అర శాతంపైగా లాభంతో ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 90 పాయింట్ల లాభంతో ఉంది. మరి మార్కెట్ ప్రారంభమయ్యే వరకు ఈ లాభాలు కొనసాగుతాయేమో చూడాలి. వెరశి.. నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది.