నాస్డాక్ నెట్‌ఫ్లిక్స్ దెబ్బ
వాల్‌స్ట్రీట్ మిశ్రమంగా ఉంది. డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు గ్రీన్‌లో ఉండగా, నెట్‌ఫ్లిక్స్ దెబ్బకు నాస్డాక్ నష్టంలో ఉంది. ఇవాళ నెట్‌ఫ్లిక్స్ 40 శాతం నష్టంతో ప్రారంభమైంది. ఇపుడు కూడా 38 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఈ ఏడాది గరిష్ఠ స్థాయి 700 డాలర్ల నుంచి ఈ ఏడాది కనిష్ఠ స్థాయికి 212 డాలర్లకు పడిపోయింది. నెట్‌ఫ్లిక్స్ దెబ్బ ఇదే రంగానికి చెందిన షేర్లపై పడింది. ఫేస్బుక్ 8 శాతం క్షీణించింది. యాపిల్ స్వల్ప నష్టంతో ఉండగా, ఇతర ప్రధాన టెక్ కంపెనీల షేర్లు మూడు శాతం పడ్డాయి. డౌజౌన్స్ 0.86 శాతం లాభపడగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.28 శాతం నష్టంతో ఉంది. నాస్డాక్ 0.9 శాతం నష్టంతో ట్రేడవుతోంది. కరెన్సీ మార్కెట్లో డాలర్ బాగా క్షీణించింది.అలాగే బాండ్ ఈల్డ్స్ కూడా 1.79 శాతం క్షీణించాయి. క్రూడ్ ఆయిల్ కూడా ఒక శాతంపైగా క్షీణించింది. బులియన్లో ఇవాళ కూడా డౌన్‌ట్రెండ్ కొనసాగుతోంది.