For Money

Business News

నెట్‌ఫ్లిక్స్: ఇన్వెస్టర్లకు హారర్‌ షో

కరోనా సమయంలో భారీగా పెరిగిన నెట్‌ఫ్లిక్స్‌ వినియోగదారులందరూ వెళ్ళిపోయారు. గత జనవరి-మార్చి మధ్య కాలంలో 2 లక్షల మంది ఇన్వెస్టర్లు వెళ్ళిపోయినట్లు నెట్‌ఫ్లిక్స్‌ పేర్కొంది. ఫలితాల తరవాత ఇవాళ స్టాక్‌ మార్కెట్‌లో నెట్‌ఫ్లిక్స్‌ షేర్‌ 40 శాతం క్షీణించింది. ఇవాళ ఏడాది కనిష్ఠ స్థాయి212.21 డాలర్లకు పడింది. 72 వారాల గరిష్ఠ ధర 700.99 డాలర్లు. నిన్న 348.61 డాలర్ల వద్ద ముగిసిన షేర్‌ ఏకంగా 40 శాతం క్షీణించడంతో ఇన్వెస్టర్లు కంగుతిన్నారు. ఇక నుంచి యాడ్స్‌ను అనుమతించాలని నెట్‌ఫ్లిక్స్‌ నిర్ణయించింది. కనీసం రెండేళ్ళలో నెట్‌ఫ్లిక్స్‌ యాడ్స్‌ ద్వారా భారీ ఆదాయం సంపాదించవచ్చని భావిస్తున్నారు.