స్థిరంగా ప్రారంభమైన నిఫ్టి
సింగపూర్ నిఫ్టికి భిన్నంగా నిఫ్టి ప్రారంభమైనా.. కొన్ని క్షణాల్లోనే లాభాలన్నీ కరిగిపోయాయి. నిఫ్టిపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. ఓపెనింగ్‌లో 17175ని తాకిన నిఫ్టి క్షణాల్లో 17185ని తాకింది. ప్రస్తుతం 13 పాయింట్ల లాభంతో 17186 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టి నెక్ట్స్ మినహా మిగిలిన సూచీలన్నీ నామ మాత్రపు లాభాలకే పరిమితమయ్యాయి. నిఫ్టి ఫైనాన్షియల్స్‌లో మాత్రం ఒత్తిడి కొనసాగుతోంది. నిఫ్టిలో 73 షేర్లు గ్రీన్‌లో ఉన్నా…నిఫ్టిలో లాభం దాదాపు జీరో. ఐటీ, బ్యాంకు షేర్లలో ఒత్తిడి కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ ట్విన్స్‌లో ఒత్తిడి కొనసాగుతోంది. ముఖ్యంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.1750 నుంచి రూ. 1379కి పడిపోయింది. విలీనం ప్రకటన తరవాత ముందు స్థాయిని కూడా బ్యాంక్ కాపాడుకోలేకపోతోంది. విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలు జరుపుతున్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నారు. ఎఫ్ఐఐలు అధిక వాటా ఉన్న కంపెనీలన్నింటిలో ఇదే పరిస్థితి కన్పిస్తోంది.