మళ్ళీ నష్టాల్లోకి వాల్‌స్ట్రీట్
బాండ్ ఈల్డ్స్, డాలర్ ఈక్విటీ మార్కెట్లను చెమటలు పట్టిస్తున్నాయి. ఇవాళ కూడా డాలర్ అర శాతంపైగా పెరిగింది. దీంతో డాలర్ ఇండెక్స్ 100.80ని దాటింది. అలాగే బాండ్ ఈల్డ్స్ కూడా 1.66 శాతం పెరిగి 2.855 శాతానికి చేరాయి. దీంతో వాల్‌స్ట్రీట్‌లో మళ్ళీ అమ్మకాలు మొదలయ్యాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఫలితాలు బాగున్నాయి. దీంతో ఆరంభంలో సూచీలన్నీ గ్రీన్‌లో ప్రారంభమయ్యాయి. కాని ఆ నామ మాత్రపు లాభాలు ఎంతో సేపు నిలబడలేదు. నాస్డాక్ 0.87 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.45 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. డౌజోన్స్ కూడా 0.36 శాతం నష్టంతో ఉంది. డాలర్‌తోపాటు అన్నిరకాల మెటల్స్, క్రూడ్ పెరగడం విశేషం. ఇటీవల 100 డాలర్ల లోపు వెళ్ళి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇవాళ 113.75 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెండి రెండు శాతంపైగా పెరగడం మరో విశేషం.