For Money

Business News

17,600పైన ప్రారంభమైన నిఫ్టి

సింగపూర్ నిఫ్టి సూచించిన స్థాయి కన్నా భారీ లాభాలతో ప్రారంభమైంది నిఫ్టి. ఓపెనింగ్‌లోనే 17627ను తాకిన తరవాత ఇపుడు 17616 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 86 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. అన్ని సూచీలు అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. నిఫ్టి మిడ్‌క్యాప్‌ సూచీ 0.71 శాతం లాభంతో ఉంది.
నిన్న భారీగా క్షీణించిన మెటల్స్‌ ఇవాళ మళ్ళీ కోలుకున్నాయి. క్రూడ్‌ ధరలు పెరగడంతో ఓఎన్‌జీసీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. క్రూడ్‌ ధరలు పెరగడం వల్ల ఏషియన్‌ పెయింట్స్‌ టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. నిఫ్టి గనుక 17650 ప్రాంతానికి చేరితే షార్ట్‌ కవరింగ్‌ వస్తుందని అనలిస్టులు భావిస్తున్నారు. పైగా మార్కెట్‌కు ఈవారంలో ఇవాళ ట్రేడింగ్‌ రోజు. మళ్ళీ ట్రేడింగ్ సోమవారమే. ఇవాళ ఇన్ఫోసిస్‌ ఫలితాలు ఉండగా, శనివారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలను ప్రకటించనుంది.