ఎల్‌ఐసీ ఐపీఓ మరింత ఆలస్యం
వచ్చే నెల మొదటివారం పబ్లిక్ ఇష్యూకు రావాలన్న ఎల్‌ఐసీ యత్నాలు ఫలించడం లేదు. స్టాక్ మార్కెట్ నిస్తేజంగా ఉన్న సమయంలో పబ్లిక్ ఆఫర్‌కు వస్తే .. ఇష్యూ విజయవంతం అవడంపై అనుమానాలు ఉన్నాయి. దీంతో పబ్లిక్ ఆఫర్‌ను మే నెల తొలి వారం కాకుండా చివరల్లో వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఇదే జరిగితే సవరించిన ప్రాస్పెక్టస్‌ను సెబి వద్ద మళ్ళీ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఇది వరకే దాఖలు ప్రాస్పెక్టస్ గడువు వచ్చే నెల మొదటివారంతో పూర్తవుతుంది. మార్కెట్ మూడ్ సరిగా లేనందున పబ్లిక్ ఆఫర్‌తో రావడానికి ఎల్‌ఐసీ అధికారులు విముఖత చూపుతున్నారు.